కడప జిల్లాలో కులహంకార దాడి ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో కులహంకార దాడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కదిరి ప్రభాకర్ అనే వ్యక్తిపై గజ్జల సుబ్బారెడ్డి అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో పాటు మరిగే నూనెను పోసినట్లు తెలిసింది. కదిరి ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు.
ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు. షిండే ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు ఏక్‌నాథ్ షిండే ఘనంగా స్వాగతం పలికారు.
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలతో కలిసి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి,డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి వంగల పూడి అనిత పేర్కొన్నారు. యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ను హోం మంత్రి అనిత పరామర్శించారు. కానిస్టేబుల్ పై మద్యం మత్తులో యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు ఈ సినిమాకు చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాపై కమల్ హాసన్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. చెన్నైలో ఓ అభిమని 'భారతీయుడు-2' సినిమాను చూసేందుకు వినూత్న రీతిలో థియేటర్ వద్దకు ఎంట్రీ ఇచ్చాడు.
ఈ నెల 5న విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్-3' సరికొత్త రికార్డు సృష్టించింది. 'మీర్జాపూర్ సీజన్ 3'అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడుతోంది. స్ట్రీమింగ్ మొదలైన తొలి వారం భారత్‌లో అమెజాన్ ప్రైమ్‌లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా నిలిచినట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది.
కురియన్ కమిటీతో సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఒక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం కేసీఆర్‌ను జైలుకు పంపడమేనని ఆయన అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ సమాధి అయ్యిందన్నారు.
శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న 'ది గోట్' చిత్రం నుంచి విజిలేస్కో అంటూ సాగే పాటను తాజాగా చిత్రం బృందం రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను యువన్ శంకర్ రాజా, నక్ష అజీజ్ పాడారు.
రాష్ట్రంలో ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.