Minister Rama Naidu: ఆ గొప్ప వ్యక్తి ఆలోచనతో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం..
- విజయవాడలో కేఎల్ రావు 120వ జయంతి వేడుకలు
- ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Rama Naidu: విజయవాడలో కేఎల్ రావు 120వ జయంతి కార్యక్రమాన్ని ఇరిగేషన్ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీలో కేఎల్ రావు జయంతిని ఘనంగా సీఎం చంద్రబాబు మొదలుపెట్టారని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేఎల్ రావు జయంతి నిర్వహించలేదన్నారు. అక్రమ ఇసుక తరలించడం మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అధికారులకు కూడ ఇంకా పాత వాసన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Home Minister Anitha: ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం..
Also Read
నదులు అనుసంధానం గురించి చెప్పిన గొప్ప వ్యక్తి కేఎల్ రావు అని.. ఉమ్మడి ఏపీకి తాగు, సాగునీరు అందించిన వ్యక్తి కేఎల్ రావు అంటూ పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లాంటి అతిపెద్ద ప్రాజెక్ట్‌ను రాతితో కట్టారని.. కేఎల్ రావు ఆలోచనతో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పోలవరాన్ని వైసీపీ నాయకులు నాశనం చేశారని.. డయాఫ్రం వాల్ నాశనం కావడానికి మాజీ సీఎం జగనే కారణమని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తానని.. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్ళారని విమర్శించారు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!