OnePlus: వన్‌ప్లస్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి త్వరలోనే అతి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్ రానుంది. చైనాకు చెందిన వన్‌ప్లస్ అంటే ఒకప్పుడు కేవలం ప్రీమియం ఫోన్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కనీసం రూ. 50 వేలు పెడితేనే వస్తుందనే ఆలోచన ఉండేది. కానీ ఇటీవల వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య మిడ్ వేరియంట్ ఫోన్‌లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ నెల చివర్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే యూరప్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మనదేశంలో త్వరలోనే లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఫ్లుయిడ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లే ప్రొటెక్షన్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 1300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12.1పై వన్‌ప్లస్ నార్డ్ 2టీతో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2టీ రెండు వేరియంట్లలో రానుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడళ్లలో విడుదల చేశారు. యూరప్‌లో బేస్ వేరియంట్ ఈ స్మార్ట్‌ఫోన్ ధర 399 యూరోలుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 32,030గా ఉంటుంది. అయితే భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ 2టీ ప్రారంభ ధర రూ. 30,000గా ఉండనుందని అంచనా వేస్తున్నారు.
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..