Ravishastri: టీ20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయవద్దంటూ మాజీ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి సూచించారు. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ టీమ్‌ఇండియాలో ఎంపికైనప్పటి నుంచి చర్చనీయాంశంగా మారాడు. ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఉమ్రాన్ మాలిక్‌కు మొదటి టీ20లో అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్‌ఇండియాలో చేర్చుకోకూడదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ ఇంకా నేర్చుకోవాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. మాలిక్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రాతినిధ్యం వహించలేదు.
ఈ తరుణంలో రవిశాస్త్రి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని కలిగించింది. ప్రస్తుతం టీ20 జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వకూడదని మాజీ కోచ్ సూచించాడు. ‘మాలిక్‌ను టీమ్‌తో తీసుకెళ్లండి. కానీ, అప్పుడే అవకాశాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నేర్చుకునేందుకు ఎంతో అవకాశం ఉంది. ఉమ్రాన్‌కు వన్డేలు లేదా టెస్టులు ఆడే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత అతని ప్రదర్శన భవిష్యత్తును నిర్ణయిస్తోంది’ అని పేర్కొన్నాడు.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ 150 కిలోమీటర్లకు మించిన వేగంతో బంతులను సంధించి మంచి ప్రదర్శన చేయడం చూశాం. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో మ్యాచుల్లో అవకాశం వస్తే సత్తా చూపిస్తాడేమో? అన్న అంచనాలున్నాయి. అయినా కానీ, అతడు ఇంకా ఎంతో మెరుగుపడాలని, అనుభవం సంపాదించాల్సి ఉందన్నాడు రవిశాస్త్రి. అతడికి అప్పుడే అంచనాలతో అవకాశం ఇవ్వడం తొందరపాటు అవుతుందన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు, ఉమ్రాన్ మాలిక్ అన్ని మ్యాచ్‌లలో వేగంగా బంతిని విసిరి, అవార్డులను గెలుచుకున్నాడు. ఇది కాకుండా, ఉమ్రాన్‌కు వికెట్లు తీయగల సామర్థ్యం కూడా ఉంది. అతను 14 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీశాడు. టీమిండియా ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉమ్రాన్ మాలిక్ ప్రతిభకు ముగ్ధుడయ్యాడు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!