గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2 నెలల్లోనే నాలుగు సార్లు గుజరాత్‌లో పర్యటించిన మోదీ.. తాజాగా శుక్రవారం దాదాపు రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్‌సారిలో జరిగిన ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే […]
ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. అయితే, ఆమె తన కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. అంతేకాకుండా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ విలేకరితో కూడా ఆమె దురుసుగా ప్రవర్తించింది. నా కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ పోలీసుపై కస్సుబుస్సుమంటూ మండిపడింది. తప్పు చేసి తప్పించుకోవడమే కాకుండా పోలీసులపై ఫైర్ అయిన ఆ యువతి ఓ ప్రజా ప్రతినిధి కుమార్తె అవ్వడం మరో విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె […]
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే భారత రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. యూపీఏ తరఫున ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌తో పాటు కేంద్ర మంత్రిగా, లోక్ సభ స్పీకర్‌గానూ రాణించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మీరా కుమార్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపిక కోసం […]
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. టీమ్‌ఇండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా సునాయాసంగా గెలిచేసింది. దక్షిణాఫ్రికా విజయంలో ప్రధానంగా మిల్లర్, రస్సీ వాండర్ డుసెన్ […]
నీట్-పీజీ 2021 కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మిగిలిన సీట్లను ఇప్పుడు భర్తీ చేస్తే.. ప్రస్తుత ఏడాదిపై ప్రభావం పడుతుందన్న కేంద్రం వివరణతో ఏకీభవిస్తున్నామన్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వైద్య విద్యలో రాజీ పడలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మిగిలిపోయిన 1,456 సీట్లకు మరో రౌండ్ ప్రత్యేక స్ట్రే కౌన్సెలింగ్ నిర్వహించాలన్న పిటిషన్లపై.. జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ […]
తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులతో తమ సైనికులు వీరోచితంగా తలపడుతున్నారని లుహాన్‌స్క్ గవర్నర్ సెర్నీ హైదాయ్ గురువారం ప్రకటించారు. గనులు, పరిశ్రమలు, సముద్రతీరంతో సుసంపన్నమైన డాన్‌బాస్‌ను హస్తగతం చేసుకునేందుకు తహతహలాడుతున్న రష్యా… ఆ ప్రాంతంలోని పలు నగరాల్లో దాడుల తీవ్రతను పెంచింది. నెలల తరబడి జరుగుతున్న యుద్ధంలో పలు పట్టణాలపై పట్టు చేజార్చుకున్న […]
గతేడాది మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడికి అసోంలోని చిరాంగ్ జిల్లా స్థానిక కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా కూడా విధించింది. చిరాంగ్ జిల్లాలో ట్యుటోరియల్ టీచర్‌గా పనిచేస్తున్న సంజీబ్ కుమార్ రేకు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి (POCSO) బిజిని గురువారం తీర్పును వెలువరించారు. గత ఏడాది జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు […]
నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయిన గంట అనంతరం.. ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇటీవల మొత్తం 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. Rajyasabha Polls: ఉత్కంఠగా రాజ్యసభ ఎన్నికలు.. […]
దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ప్రజల్లో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రుసగా రెండోరోజూ కొత్త కేసులు ఏడు వేల మార్కు దాటాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 7,584 మంది వైరస్ బారిన పడ్డారు. 24 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. గురువారం 3,791 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల […]
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతడికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నాటింగ్‌హమ్ వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు కేన్ దూరం కానున్నాడు. కరోనా బారిన పడటంతో కేన్ ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో అతడికి రీప్లేస్‌మెంట్‌గా హమిష్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నారు. Markram: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్‌క్రమ్‌కు కొవిడ్ కేన్‌కు కొవిడ్ సోకడంతో మూడు టెస్టుల సిరీస్‌లో […]