బీఆర్ఎస్ పార్టీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గట్టి షాక్ ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ భనవ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఆయన డుమ్మా కొట్టాడు.
బీఆర్కే భవన్ లో పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ ను టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా రెండవ పీఆర్సీని 1.7. 2023 నుంచి 51 శాతం ఫిట్మెంట్ తో ఆనాటికి ఉన్న 33.67 శాతం మొత్తం కలిపి అందజేయాలి అని కోరారు.
భద్రాద్రిలో రాములవారి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సెక్టార్ లో అవినీతిని పూర్తిగా అంతరించాలి అని పేర్కొన్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు చక చక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పటేల్ గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, సంగారెడ్డి వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఐదో విడత రైతు భరోసా నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34, 288 కోట్ల రూపాయలను చెల్లించామని ఆయన తెలిపారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని.. అలాగే, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన అష్ఠ ద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మీ, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం రెండో రోజు విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొనసాగుతోంది.
తాజాగా మరో కుంభకోణం బయటకు వచ్చింది. ఆవుల కొనుగోలు అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే, ఆవుల కొనుగోలు వివరాలను సేకరించిన ఏసీబీ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారతీయ నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం నాడు ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో సుమారు 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని సీజ్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లిపోయారు. వారందరూ బీజేపీతో టచ్ లో ఉన్నట్లు టాక్.