పశుసంవర్ధక శాఖలో రోజులో స్కామ్ బయటపడుతుంది. తాజాగా మరో కుంభకోణం బయటకు వచ్చింది. ఆవుల కొనుగోలు అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే, ఆవుల కొనుగోలు వివరాలను సేకరించిన ఏసీబీ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆవుల కొనుగోలులో దాదాపు 3 కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించినట్లు గుర్తించారు.
Read Also: Tera Kya Hoga Lovely : డీ గ్లామర్ లుక్ లో ఇలియానా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
ఇక, ప్రభుత్వ నిధుల నుంచి 8.5 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయి.. మిగిలిన 4.5 కోట్ల రూపాయల బినామీ అకౌంట్స్ కి ముఠా సభ్యులు మళ్ళించారు. రైతులు నిలదీయడంతో ముఠా సభ్యులు కోటిన్నర రూపాయలను తిరిగి ఇచ్చారు. తమకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ నుంచి రావాలంటూ ఏసీబీ అధికారులకు పుంగనూరు ఆవుల రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.