Himachal Pradesh Political Crisis: హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం.. మైనార్టీలో కాంగ్రెస్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Political Crisis: రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమానంగా ఓట్లు రావడంతో హస్తం పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ పార్టీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు స్టార్ట్ చేసింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ 6 కాంగ్రెస్ ఎమ్యెలేలతో చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడాతో పాటు డీకే శివకుమార్ ను పంపించింది. అయితే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు ఇవాళ డీకే శివుకుమార్, భూపేందర్ సింగ్ సిమ్లాకు చేరుకోనున్నారు.
Read Also: Jacintha Kalyan: అప్పుడు రిసెప్షనిస్ట్.. ఇప్పుడు పిచ్ క్యూరేటర్! ప్రశంసించిన జై షా
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
అయితే, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లిపోయారు. వారందరూ బీజేపీతో టచ్ లో ఉన్నట్లు టాక్. హర్యానాలోని పంచకులాలోని గెస్ట్‌హౌస్ బయట ఓ కాన్వాయ్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ శర్మ, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక, అసెంబ్లీ సమావేశాలకు ముందు నేటి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీజేపీ ఎమ్మెల్యేలు కలవనున్నట్లు అనేక కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిందని జై రాం ఠాకుర్ నేతృత్వంలోని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also: Paytm : పేటీఎం లాంటి అక్రమాలు మళ్లీ జరుగకుండా ఆర్బీఐ పక్కా ప్లాన్
ఇక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఒక్క రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్ విజయం ఈజీ అని అందరు అనుకున్నారు. కానీ, భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారు.. దీంతో కాంగ్రెస్, బీజేపీకి 34 ఓట్లు వచ్చాయి.. ఫలితం టై కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీయగా.. అందులో బీజేపీకి చెందిన హర్ష్ మహాజన్ పేరు రావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోయారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?