PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు చక చక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పటేల్ గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, సంగారెడ్డి వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ఆయన చేయనున్నారు.
Read Also: Kalyandurg: కళ్యాణదుర్గం టీడీపీలో వర్గ విభేదాలు..! ఇప్పుడు ఫ్లెక్సీ వార్..
ఇక, సంగారెడ్డి జిల్లాలో 1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న NH- 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణను 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ప్రధాని బహిరంగ సభతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు.