భద్రాద్రిలో రాములవారి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సెక్టార్ లో అవినీతిని పూర్తిగా అంతరించాలి అని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే సుమారు 22 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని తెలిపారు.
Read Also: Weather Alert: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు.. వాతావరణశాఖ హెచ్చరికలు
ఇక, తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం మెగా డీఎస్సీనీ ప్రకటించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 11 వేల ఉద్యోగ నియామకాలను ఎన్నికల కోడ్ కు ముందుగానే చేపడతాం అని పేర్కొన్నారు. గత పద్దతులు మానుకుని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మంచి చేసేలా అధికారులు ముందుకు వెళ్ళాలి అని ఆయన సూచనలు చేశారు. ధరణి పోర్టల్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ లను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా మండల స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తాం అని మంత్రి చెప్పుకొచ్చారు.