అదానీ, అంబానీ ఆస్తిని కూడా సగటు భారత పౌరునితో పోల్చితే ఎలా..? అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అట్లా చూసి సగటు పౌరుని జీవన ప్రమాణాలు పెరిగాయని ఎట్లా అంటారు అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు అని ఆయన చెప్పుకొచ్చారు.
హైదరబాద్ నగర శివారులోని నార్సింగ్ లో హిట్ అండ్ రన్ ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆర్మీ ఉద్యోగి కునాల్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని తార్నాకలోని CSIR - IICT లో సైన్స్ సిటీ సెంటర్ కు సైన్స్ & టెక్నాలజీ మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్ తో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యమ స్ఫూర్తీతో పని చేయాల్సిన నాటి ప్రభుత్వం గాలికి వదిలేసింది అని విమర్శించారు. కల్వకుంట్ల ఉద్యోగాలు ఊడగొట్టిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని నేతలకు తెలిపారు. జిల్లాలో పార్టీ ఓడిపోయినా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ పై వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన సూచించారు.
కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే రాష్ట్ర అబివృద్ధి కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డబ్బులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు అని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.