సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. మరో తొమ్మిది మందికి తీవ్క గాయాలు అయ్యాయి. అయితే, ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి వచ్చారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.
Read Also: CPI Ramakrishna: ఏపీకి ద్రోహం చేసిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తిరస్కారం తప్పదు..
ఇక, ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టానికి సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ఉన్నారని.. వారంతా కూలీ పనుల కోసం వెళ్తుండగా ఈ దారుణం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.