IBomma Ravi : తెలుగు సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌ల నిర్వాహకుడు బోడపాటి రవి అలియాస్ ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ మంజూరు చేయాలని రవి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పూర్తిగా కొట్టివేసింది. మంగళవారం నాంపల్లి కోర్టులో జరిగిన విచారణలో, నిందితుడు ఐబొమ్మ రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రవిపై నమోదైన నాలుగు వేర్వేరు కేసులలో, ఒక్కో కేసులో మూడు రోజుల చొప్పున, మొత్తం 12 రోజుల పాటు కస్టడీలో విచారించాలని కోర్టు సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. ఈ విచారణ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
Social Vetting: ఆన్లైన్లో వెర్రి వేషాలు వేస్తే యూఎస్లో అడుగుపెట్టలేరా..?
ఐబొమ్మ రవి, ఐబొమ్మ, బప్పంతో సహా 17 పైరసీ వెబ్‌సైట్ల ద్వారా కొత్త సినిమాలు విడుదలైన వెంటనే వాటిని అప్‌లోడ్ చేస్తూ, తెలుగు సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల మేర నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ పైరసీ నెట్‌వర్క్‌పై మరింత లోతైన దర్యాప్తు జరిపి, మొత్తం వ్యవస్థను ఛేదించేందుకు ఈ కస్టడీ సమయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వినియోగించుకోనున్నారు. రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్, తమ క్లయింట్‌ను ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి తీసుకున్నారని, దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే, రవికి బెయిల్ మంజూరు చేస్తే, కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశం ఉందని, పైరసీ ద్వారా పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లినందున దర్యాప్తు పూర్తి కావాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు బలంగా వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, రవి బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.
Off The Record: సీఎం రేవంత్ ఇన్ని రోజులు ఢిల్లీలో ఎందుకున్నారు.. ఏదో జరిగిపోతోందన్న గుసగుసలు!