నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ ఎంక్వైరీ వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ లో దోబిఘాట్ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం మడ్ ఫోర్డ్ దోబిఘాట్ ఫేజ్ -2లో మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను ఆయన ప్రారంభించారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో BRS- BSP కలిసి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. చాలా అంశాల్లో కలిసి పని చేశాం.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి- ప్రధాని మోడీని బడా భాయ్ అని చెప్పి గుజరాత్ మోడల్ తెలంగాణలో అమలు చేస్తా అంటున్నాడు అని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
జీవో-3 పై కవిత మహిళాలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్- 1 నోటిఫికేషన్ పై ఇచ్చిన మెమో మీరు ఇచ్చారు.. ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేని మీరు.. ఇప్పుడు మట్లాడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వేచి ఉండండి అంటూ ఇవాళ అతను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ప్రధాని మోడీ రాకతో మార్పులు చేశారు. దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 7:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా.. ఆలస్యం కారణంగా రాత్రి 8:40 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.