TS Govt Employees Association: బీఆర్కే భవన్ లో పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ ను టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా రెండవ పీఆర్సీని 1.7. 2023 నుంచి 51 శాతం ఫిట్మెంట్ తో ఆనాటికి ఉన్న 33.67 శాతం మొత్తం కలిపి అందజేయాలి అని కోరారు. ఇక, కనిష్ట వేతనం 35,000 నుంచి గరిష్ట వేతనం 2,99,100 రూపాయలు ఇవ్వాలన్నారు.
Read Also: SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..
ఇక, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలి అని టీజీఓ, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్క్రీన్ ను ఇప్పుడున్న 6/ 12 /18 /24 స్థానాలలో 5/ 10 /15 /20 25 లుగా ఇవ్వాలన్నారు. అయితే, ఇంటి అద్దె బత్యాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో 27 శాతంగా 2 లక్షలకు పై జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్ లో 18.5 శాతంగా 50 వేల కంటే ఎక్కువగా రెండు లక్షల కంటే తక్కువ జనాభా గలిగిన మండల కేంద్రాల్లో 14 శాతం అలాగే, మిగతా స్థానాల్లో 11.5 శాతం అద్దె చెల్లించాలి అని డిమాండ్ చేశారు.
Read Also: Minister Ponguleti: రెవెన్యూ సెక్టార్ లో అవినీతిని పూర్తిగా అంతరించాలి..
అయితే, కనీస పెన్షన్ మొత్తాన్ని 9,500 నుంచి 17,500 రూపాయలకు పెంచాలి అని టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఇక, రిటైర్మెంట్ గ్రాట్యుటీ 16 లక్షల నుంచి 24 లక్షలు పెంచాలన్నారు. 15 సంవత్సరాల సర్వీసు నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగి కానీ పెన్షనర్లు కానీ చనిపోతే ఇప్పుడున్న 30 వేల దహన ఖర్చులను 75 వేల రూపాయలకు పెంచాలి అని కోరారు. అయితే, హౌస్ బిల్డింగ్ అడ్వాన్సులను ఇప్పుడున్న స్థానాన్ని పెంచి 30, 40, 50 లక్షలుగా ఇవ్వాలి అని పేర్కొన్నారు. అలాగే, కామన్ క్యాటగిరి ఉద్యోగుల వేతనాన్ని గత కొన్ని పీఆర్సీలలో నెగ్లెట్ చేస్తున్నారు.. కనుక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపర్నెంట్ స్కేల్స్ ను ధరల ఆధారంగా పెంచి ఇవ్వాలన్నారు. పీఆర్సీ కమిటీ ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోపలనే తన నివేదికని ప్రభుత్వానికి సమర్పించాలి అని టీజీవో- టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.