Bhadrachalam MLA Tellam Venkatarao: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఇక, తాజాగా బీఆర్ఎస్ పార్టీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గట్టి షాక్ ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ భనవ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఆయన డుమ్మా కొట్టాడు. నిన్న కుటుంబ సమేతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
Read Also: Somnath: ఆ రోజే క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.. కీలక విషయాలు బయటపెట్టిన ఇస్రో చీఫ్
అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావు.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక, తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ రోజు ఉదయం భద్రాచలం బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం అయ్యారు. అయితే, ఇప్పటికే ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సన్నహాక సమావేశం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతుంది.