Drugs Seized: 3,300 కేజీల డ్రగ్స్ సీజ్.. పాకిస్థాన్ ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారతీయ నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగళవారం నాడు ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో సుమారు 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని సీజ్ చేశారు. గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద డ్రగ్స్ పట్టివేత అని నేవీ వెల్లడించింది. సుమారు 3089 కేజీల ఛారస్, 158 కేజీల మెటా ఫెటమైన్, 25 కేజీల మార్ఫైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఓ చిన్న షిప్‌ను నేవీ పట్టుకుంది.
Read Also: Mali : వంతెన పై నుంచి పడిన బస్సు.. 31మంది మృతి
Also Read
కాగా, ఆ షిప్‌లో ఉన్న ఐదుగురు పాకిస్థానీలను భారతీయ నేవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పీ8ఐ ఎల్ఆర్ఎంఆర్ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పోరుబందర్ తీరం దగ్గర తిరుగుతున్న అనుమానిత షిప్‌ను గుర్తించారు. ఇక, ఆ షిప్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు నౌకాదళం అధికారులు వెల్లడించారు. అయితే, కొన్ని రోజుల క్రితం పుణెలో సుమారు 2500 కోట్లు రూపాయల ఖరీదు చేసే 1100 కేజీల మెఫిడ్రోన్ అనే డ్రగ్స్ ను సైతం పట్టుకున్నారు.
#IndianNavy in a coordinated ops with Narcotics Control Bureau, apprehended a suspicious dhow carrying almost 3300Kgs contraband (3089 Kgs Charas, 158 Kgs Methamphetamine 25 Kgs Morphine).
The largest seizure of narcotics, in quantity in recent times.@narcoticsbureau pic.twitter.com/RPvzI1fdLW— SpokespersonNavy (@indiannavy) February 28, 2024
తాజావార్తలు
-
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
-
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
-
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?