మహిళల దుస్తుల ఎంపికను గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఒక వ్యక్తి ఏం ధరించాలో నిర్దేశించకూడదన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు.
కెనడాలో గత ఏడాది భారత దౌత్యా అధికారులకు వరుసగా బెదిరింపులు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పుకొచ్చారు. అదే టైంలో ఆ దేశ వ్యవస్థల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు అని పేర్కొన్నారు.
చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా అక్షత తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు రోడ్లపై కనపడ్డారు. తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తితో పాటు తన ఇద్దరు కుమార్తెలు అనౌష్క, కృష్ణతో కలిసి సిటీలోని రాఘవేంద్ర మఠానికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఎలాంటి భద్రత లేకుండా సాధారణ పౌరుల్లా అక్కడ పరిసరాల్లో కలియతిరిగారు.
వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారీ తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి అందిన లెక్కల ప్రకారం.. మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో 21.5 కోట్ల మంది వ్యక్తులు కేవలం 29 ఏళ్లలోపు వారు మాత్రమే ఉన్నారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు.
వాళ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపికకు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.
పాకిస్థాన్ దేశానికి భారతదేశం మరో షాక్ ఇచ్చింది. రావి నది జలాలను పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. అయితే, దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడమే దీనికి ప్రధాన కారణం.
ఈజిప్టు రాజధాని కైరో శివారులో నైలు నదిలో ఓ ఫెర్రీ బోటు మునిగిపోవడంతో 19 మంది కూలీలు మరణించారు. గ్రేటర్ కైరోలో భాగమైన గిజాలోని మోన్షాత్ ఎల్ కాంటేర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో 19 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తుంది.