కొందరు కేటుగాళ్లు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తికే టోకరా వేశారు. కేంద్రంలోనీ అధికారంలో ఉన్న పార్టీకి పొలిటికల్ బాండ్ పేరుతో మోసం చేశారు. పొలిటికల్ బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారు.
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిన్న ( మంగళవారం ) సయ్యద్ అబ్బాస్ ఆలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
తమిళనాడులోని పల్లడం దగ్గరప్రధాని మోడీని జర్మనీ సింగర్ కసాండ్రా మే స్పిట్ మాన్ సమావేశం అయ్యారు. ఆమె 'అచ్యుతమ్ కేశవమ్' భక్తి గీతాన్ని ఆలపిస్తుండగా.. దానికి మోడీ తన చేతులతో దరువేస్తూ ఆమె పాటను ఆస్వాదించారు.
హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నాడు అర్థరాత్రి సమయంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీకి దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణాల్లో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 19 వరకు జరిగే ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగనున్నాయి.
లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయంపై ఇవాళ తొలిసారి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు.
గగన్యాన్ మిషన్ కోసం ఎదురుచూస్తున్న భారత్కు ఇవాళ శుభవార్త అందింది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను దేశానికి పరిచయం చేశారు.
భారత్- బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగింటిపై దాడులు జరిగినట్లు అనేక కథనాలు వస్తున్నాయి. వీటిల్లో భారత్- ఐరోపా మధ్య సేవలు అందించేవి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.