Yulia Svyrydenko: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా స్విరిడెన్‌కో (Yulia Svyrydenko)ను ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా గురువారం (జులై 17)న నియమించారు. 2022లో రష్యాతో జరిగిన యుద్ధం తర్వాత ఈ పదవిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ నియామకం ఉక్రెయిన్ ప్రభుత్వంలోని కీలక మార్పులలో ఓ భాగం.
యుద్ధంతో అలసిపోయిన దేశ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపేందుకు, స్థానికంగా ఆయుధ ఉత్పత్తిని పెంచేందుకు, ఇంకా క్యాబినెట్ మారుస్తునట్లు జెలెన్స్కీ ప్రకటించారు. అయితే దేశీయంగా ఈ మార్పులు పెద్దగా కొత్త దిశగా మారాయని భావించబడటం లేదు. ఎందుకంటే, అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికీ యుద్ధంలో తన నమ్మకాన్ని నిలబెట్టుకున్న వ్యక్తులను మాత్రమే బాధ్యతలకు నియమిస్తున్నారు.
Asaduddin Owaisi: ఓటర్ లిస్ట్‌లో విదేశీయులు కనిపిస్తారు.. పహల్గాం ఉగ్రవాదులు మాత్రం కనిపించరా..?
ఇప్పటి వరకూ ప్రధానమంత్రిగా ఉన్న డెనిస్ ష్మైహాల్ (Denys Shmyhal) తన రాజీనామాను మంగళవారం ప్రకటించారు. ఆయన ఉక్రెయిన్ చరిత్రలోనే అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. 2020 మార్చి 4న పదవిలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన్ను రక్షణ మంత్రిగా నియమించనున్నారు. దీని ద్వారా ఆయన పూర్తిగా పాలన నుండి తప్పుకోకుండా, యుద్ధం నేపథ్యంలో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతను చేపడుతున్నారు.
స్విరిడెన్‌కో గతంలో అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజ ఒప్పందం సమయంలో కీలకంగా వ్యవహరించారు. అమెరికా ప్రతినిధులతో మాట్లాడి ఉక్రెయిన్‌కు అనుకూలమైన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయించారు. ఆమె పశ్చిమ దేశాలతో అధికస్థాయి చర్చల్లో ఉక్రెయిన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆర్థిక పునరుద్ధరణ, రక్షణ సహకారం, పునర్నిర్మాణం అంశాల్లో కీలకంగా నిలిచారు.
ఆమెను పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సహచరులు ప్రమాణబద్ధత, కృషి, అధ్యక్ష పట్ల నిబద్ధత ఉన్న నాయకురాలిగా అభివర్ణించారు. జెలెన్స్కీ ఇటీవల స్విరిడెన్‌కో, ఇంకా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రితో కలిసి తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలలలో ఆయుధ ఉత్పత్తి పెంపు, డ్రోన్ల కాంట్రాక్టింగ్ పూర్తి చేయడం, ఆర్థిక నియంత్రణలను సడలించడం, సామాజిక పథకాల అమలు వంటి అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.