Elon Musk: ఎక్స్ అంతరాయానికి ఉక్రెయినే కారణం.. మస్క్ సంచలన ఆరోపణ
- ఎక్స్ అంతరాయానికి ఉక్రెయినే కారణం
- ఎలోన్ మస్క్ సంచలన ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా ‘ఎక్స్’ ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సోమవారం నుంచి ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 40 వేల మందికిపైగా ఫిర్యాదులు వెళ్లాయి. ఇదిలా ఉంటే మంగళవారం కూడా అదే అంతరాయం కొనసాగుతోంది. దీంతో వందలాది మంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పదే పదే క్రాష్ అవుతోంది.
తాజాగా అంతరాయంపై ‘ఎక్స్’ యాజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. ఎక్స్‌పై సైబర్ దాడి జరిగిందని.. దీనికి ఉక్రెయినే కారణమని తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు కనుగొన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతం నుంచే ఈ సైబర్ దాడి జరిగినట్లుగా గుర్తించినట్లు చెప్పారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
అయితే ఈ సైబర్ దాడికి పాలస్తీనా అనుకూల హ్యాకర్ గ్రూప్ బాధ్యత వహించింది. పాలస్తీనా అనుకూల సంస్థ డార్క్ స్టార్మ్ టీం బాధ్యత వహించింది. పాలస్తీనా అనుకూల గ్రూప్ బాధ్యత వహించినప్పటికీ.. దీనికి మూలం మాత్రం ఉక్రెయినే కారణంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయని మస్క్ పేర్కొన్నారు.
‘‘ఏం జరిగిందో కచ్చితంగా తెలియదు గానీ.. ఉక్రెయిన్ ప్రాంతానికి సంబంధించిన ఐపీ చిరునామాలతో ఎక్స్ వ్యవస్థను కూల్చేసేందుకు భారీ సైబర్ దాడి జరిగింది.’’ అని మస్క్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Nizamabad: నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు..
ఇదిలా ఉంటే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపే దేశాలపై పాలస్తీనా అనుకూల హ్యాకర్ గ్రూప్ డార్క్ స్టార్మ్ టీమ్ దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న అమెరికాను ఈ హ్యాకర్ గ్రూప్ టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ మస్క్ మాత్రం.. ఉక్రెయిన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇటీవల వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గొడవ పెట్టుకున్నారు. మీడియా వేదికగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. అనంతరం జెలెన్‌స్కీకి ఐరోపా దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌పై మస్క్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎక్స్ వ్యవస్థ దెబ్బతినడానికి కారణాలను అన్వేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vikram : విక్రమ్ సినిమా తెలుగు స్టేట్స్ మంచి ధర పలికింది
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..