ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దీంతో ట్రంప్‌నకు సహనం నశించింది. ఎన్ని సార్లు చెప్పినా పుతిన్ మాట వినడం లేదని కోపం కట్టలు తెంచికొచ్చినట్లుంది. ఈ నేపథ్యంలో 50 రోజుల్లో ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకపోతే భారీగా సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. కానీ రష్యా మాత్రం.. ఆ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పింది. దీంతో రష్యా ఇక మాట వినదని ట్రంప్ ఒక అంచనాకు వచ్చేశారు.
ఇది కూడా చదవండి: Twist : ‘వైరల్’ కోసం వల్గారిటీ.. సోషల్ మీడియా స్టార్స్ అరెస్ట్..!
ఈ నేపథ్యంలోనే రష్యాపై భారీ దాడికి ప్లాన్ చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ట్రంప్ కోరినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికా అందించే ఆయుధాలు మాస్కోను తాకగలవా? అని జెలెన్‌స్కీని ట్రంప్ అడిగినట్లు తెలుస్తోంది. జూలై 4న పుతిన్‌తో ట్రంప్ మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రశ్న అడిగినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Lowest total in Tests: టెస్టుల్లో అత్యల్ప స్కోర్ చేసిన చేసిన జట్లు ఇవే..!
అమెరికా సరఫరా చేసే లాంగ్ రేంజ్ క్షిపణులు.. రష్యా లోపలికి దూసుకుని పోయేలా ప్లాన్ చేయాలని ట్రంప్ కోరినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఈ మేరకు నివేదించింది. అమెరికా తయారు చేసిన ATACMS క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించే అవకాశంపై అధికారులతో ట్రంప్ చర్చించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను పెంటగాన్ నిలిపివేసిన కొన్ని వారాల తర్వాత ఈ చర్చ జరగడం విశేషం.