Joe Biden: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పలు సమావేశాల్లో అసలు ఏం చేస్తున్నాడో కూడా అర్థం అవ్వడం లేదు. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ-7 సమావేశాల్లో దేశాధినేతలంతా ఫోటోలకు ఫోజ్ ఇస్తుంటే, బైడెన్ మాత్రం వేరే వైపు వెళ్లడం, అక్కడ ఎవరూ లేకున్నా చేతులతో అభివాదం చేయడం వైరల్‌గా మారింది.
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షడు వొలోడిమిర్ జెలన్ స్కీ హత్యకు కుట్ర పన్నిన ఒక వ్యక్తిని పోలాండ్‌లో అరెస్ట్ చేశారు. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలాండ్, ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు గురువారం తెలిపారు.
Zelensky: రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడం లేదు. ఇరు వర్గాలు కూడా శాంతికి సిద్ధపడటం లేదు. మరోవైపు యుద్ధం కొనసాగించేందుకు ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సాయం కోరుతున్నారు. తాజాగా ఆయన జర్మనీ పర్యటనకు వెళ్లారు. అక్కడి స్టేట్ మీడియాతో మాట్లాడుతూ.. మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదం గురించి జర్మనీ ఛాన్సలర్ (ఓలాఫ్ స్కోల్జ్) తెలుసుకున్నట్లు నాకు అనిపిస్తోందని ఆయన అన్నారు.
Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటున్నాడు. తాను పెంచి పోషించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
ఉక్రెయిన్ కు తాము దీర్ఘ శ్రేణి క్షిపణులు పంపుతామని బ్రిటన్ ఇటీవలే ప్రకటించింది. ఇంకా ఏం చేయాలన్న విషయంపై జెలెన్ స్కీతో చర్చించానని రిషి సునక్ ఇవాళ వెల్లడించారు. తమకు సాయం చేస్తున్నందుకు ఉక్రెయిన్ ప్రజల తరఫున, సైనికుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు.
Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. బుధవారం ఉక్రెయిన్ లోని దక్షిణ ఖేర్సన్ ప్రాంతంపై రష్యా క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 21 మంది మరణించడంతో పాటు 48 మంది గాయపడ్డారు. శుక్రవారం నుండి ప్రధాన నగరమైన ఖెర్సన్‌లో అధికారులు కర్ఫ్యూ విధించారు.
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అంతమొందించడానికి మాస్కోలోని అధ్యక్ష భవనంపై డ్రోన్ అటాక్ ప్రపంచాన్ని కలవరపరిచింది. ఈ ఘటనకు ఉక్రెయిన్ కారణం అని, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ పథకం ప్రకారమే పుతిన్ ను అంతమొందించడానికి ప్రయత్నించాడని రష్యా పార్లమెంట్ ఆరోపించింది. తమకు ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందని రష్యా తీవ్ర స్వరంతో హెచ్చరించింది.
Zelensky: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరికి సంవత్సరం గడిచింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్దం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్, ఖేర్సర్, లూహాన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను కూడా కోల్పోయింది.
Donald Trump: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఆయన అమెరికాలో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మరోసారి ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని తాను 24 గంటల్లో పరిష్కరించగలనని తెలిపాడు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు అధ్యక్షత వహించడం…