Lucknow T20: లక్నో వేదికగా జరుగుతోన్న రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా రెండో మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది.
గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు
Chahal- Dhanashree: ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అతడి పేరును నెటిజన్‌లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం అతడి భార్య ధనశ్రీ వర్మ. ఆమెతో చాహల్ బంధం తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీవర్మ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరికీ లింక్ ఉన్నట్లు నెటిజన్‌లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారం ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి…
Yuzvendra Chahal: ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పేరు మార్మోగిపోతోంది. చాహల్, అతడి భార్య ధనశ్రీ మధ్య విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. చాహల్ భార్య ధనశ్రీ సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడం కలకలం రేపింది. ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన భర్త ఇంటిపేరు ‘చాహల్’ను తొలగించింది. దీంతో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సెలబ్రిటీలు పేర్లు మార్చుకోవడం విడాకులకు దారి తీస్తుందని ఇటీవల పలు ఘటనలను నెటిజన్‌లు గుర్తుచేస్తున్నారు. గత…
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసిందన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే.. యుజ్వేంద్ర చాహల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఈ భారత స్పిన్నర్.. 39 ఏళ్ల కిందట రికార్డును బద్దలుకొట్టాడు. 1983 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో మొహిందర్ అమర్‌నాథ్ విండీస్ నడ్డి విరచడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 12 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఇచ్చాడు. లార్డ్స్ మైదానంలో…
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తొలుత రెండు మ్యాచులు ఓడిపోయిన సంగతి తెలిసిందే! దీంతో, ఈ సిరీస్ భారత్ చేజారినట్టేనని కామెంట్స్ వచ్చాయి. మొదటి మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు చేసినా డిఫెండ్ చేయలేకపోవడం, రెండో మ్యాచ్‌లో 148 పరుగులకే చేయడంతో.. భారత ప్రదర్శనతో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రదర్శనతో సిరీస్ నెగ్గడం కష్టమేనంటూ చాలామంది పెదవి విరిచారు. అయితే, ఆ విమర్శలకు చెక్ పెడుతూ భారత్ మూడో మ్యాచ్‌ని కైవసం చేసుకుంది.…
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీపై టీమిండియా స్పిన్నర్ చాహల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఏడాది మెగా వేలంలో తనను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఈ హామీని ఆర్సీబీ తుంగలో తొక్కిందని చాహల్ విమర్శలు చేశాడు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ ఈ ఆరోపణలు చేశాడు. తాను ఆర్‌సీబీ టీమ్‌లో ఉండాలంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో తాను ఆర్సీబీని వీడి మరో…
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అయితే గంటల వ్యవధిలోనే చండీగఢ్ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. గత సంవత్సరం జరిగిన లైవ్ చాట్‌లో ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు కావడంతో యూవీని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది రోహిత్ శర్మతో జరిగిన లైవ్ చాటింగ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిబ్రవరిలో హరియాణాలోని హన్సి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు…
ఐపీఎల్ లోని పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్ 2021 వాయిదాకు ముందే కొందరు ఆటగాళ్లు లీగ్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ వాయిదా పడకపోయినా నేను లీగ్ నుండి వెళ్లిపోయేవాడిని అని యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. తాజాగా చాహల్ మాట్లాడుతూ … ‘నా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే.. ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నా. ఇంటి దగ్గర వాళ్లు ఒంటరిగా ఉన్న…