Ind vs SL 2nd Odi: గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మునుపటి మ్యాచ్‌లో స్వల్ప గాయం కాగా.. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌ని తీసుకున్నారు. బ్యాటర్లు విరుచుకుపడడంతో తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి మళ్లీ అదే ప్రదర్శనను కనబరచాలని టీమిండియా భావిస్తుండగా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితి లంకది. భారత జట్టు ఫామ్‌ను చూస్తే బలంగా ఉంది. భారత జట్టును ఎదుర్కోవాలంటే లంక జట్టు సర్వశక్తులు ఒడ్డాల్సిందే.
ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను పట్టేయాలని టీమిండియా భావిస్తోంది. మొదటి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. తొలి వన్డేలో బ్యాటుతో అదరగొట్టిన కోహ్లీ 73వ అంతర్జాతీయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్‌లో ముగ్గురు బ్యాటర్‌లో తమ బ్యాట్‌తో సమాధానం చెప్తే భారత్ విజయం నల్లేరుపై నడకే అని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సిరీస్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నందున ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.
రెండో వన్డేలో ఇరు జట్లు ఇవే..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్
శ్రీలంక జట్టు: కుసాల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, నువానీదు ఫెర్నాండో, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత