ఐపీఎల్ లోని పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్ 2021 వాయిదాకు ముందే కొందరు ఆటగాళ్లు లీగ్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ వాయిదా పడకపోయినా నేను లీగ్ నుండి వెళ్లిపోయేవాడిని అని యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. తాజాగా చాహల్ మాట్లాడుతూ … ‘నా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే.. ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నా. ఇంటి దగ్గర వాళ్లు ఒంటరిగా ఉన్న సమయంలో ఇలా జరిగితే.. ఆటపై దృష్టి సారించడం చాలా కష్టమవుతుంది. మే 3న నా తల్లిదండ్రులకు పాజిటివ్ అని నిర్ధరణ అయింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కాలేదు. కాకపోతే ఆ మరుసటి రోజే ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆ సమయంలో నా తండ్రి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. ఒకవేళ అప్పుడు బీసీసీఐ ఐపీఎల్ ను వాయిదా వేయకపోయినా నేను టోర్నీ నుంచి వచ్చేసేవాడిని అని అన్నాడు.