Lucknow T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow T20: లక్నో వేదికగా జరుగుతోన్న రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా రెండో మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. టీ20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాక ఒక్క సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఆడుతోంది. మరో వైపు తొలి టీ20 ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నామని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తెలిపాడు. ఈ పిచ్ మీద గత రికార్డులను బట్టి చూస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచిందని శాంట్నర్ చెప్పాడు. మరోవైపు వన్డే సిరీస్ చేజార్చుకున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్ అయినా గెలవాలని పట్టుదలతో ఉంది. రెండో మ్యాచులోనూ భారత్ ను ఓడించి ట్రోఫీ కొట్టేయాలన్న కసితో న్యూజిలాండ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ను కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆడిస్తున్నట్లు తెలిపాడు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు, మరో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు.
భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్.
Also Read
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైకెల్ బ్రాస్‌వెల్, జాకబ్ డఫే, ఇష్ సోధీ, లాకీ ఫెర్గ్యుసన్, బ్లెయిర్ టిక్నర్.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..