IND vs SA: ద్రవిడ్ ఉన్నంతవరకూ.. భారత్ ఓడిపోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తొలుత రెండు మ్యాచులు ఓడిపోయిన సంగతి తెలిసిందే! దీంతో, ఈ సిరీస్ భారత్ చేజారినట్టేనని కామెంట్స్ వచ్చాయి. మొదటి మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు చేసినా డిఫెండ్ చేయలేకపోవడం, రెండో మ్యాచ్‌లో 148 పరుగులకే చేయడంతో.. భారత ప్రదర్శనతో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రదర్శనతో సిరీస్ నెగ్గడం కష్టమేనంటూ చాలామంది పెదవి విరిచారు. అయితే, ఆ విమర్శలకు చెక్ పెడుతూ భారత్ మూడో మ్యాచ్‌ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి, 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
ఈ నేపథ్యంలోనే భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీనియర్స్ లేకపోయినా, ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని అన్నాడు. ఈ జట్టు వెనుక రాహుల్ ద్రవిడ్ ఉన్నాడని, అతను ఉన్నంతవరకూ స్వేదశంలో భారత జట్టు అంత తేలికగా ఓడిపోదని తెలిపాడు. ‘‘మూడో టీ20లో విజయం సాధించి, భారత్ సిరీస్‌పై ఆశలు సజీవంగానే ఉంచుకుంది. స్వదేశంలో టీమిండియా అంత సులువుగా ఓడిపోదు. కాబట్టి.. ఇప్పుడు ఒత్తిడి ఉన్నది భారత్‌పై కాదు, దక్షిణాఫ్రికాపై! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకపోయినా.. పోరాట పటిమ ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లని అభినందించాల్సిందే! హర్షల్ పటేల్, చాహల్ బాగా బౌలింగ్ చేయడంతో.. మూడో మ్యాచ్‌ని కైవసం చేసుకోగలిగారు. ఇప్పుడు ఈ పోటీ ఆసక్తికరంగా మారింది’’ అని ఇంజమామ్ అన్నాడు.
Also Read
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
అంతేకాదు.. తొలుత ఈ సిరీస్‌ని దక్షిణాఫ్రికా కౌవసం చేసుకుంటుందని అనిపించిందని, దాన్ని భారత బౌలర్లు అడ్డుకున్నారని ఇంజమామ్ తెలిపాడు. ద్వితీయ శ్రేణి జట్టు బాగా పోరాడుతోందని, అది చూడ్డానికి కనులవిందుగా ఉందన్నాడు. అండర్-19 జట్టుతో పని చేసిన అనుభవం ఉన్న ద్రవిడ్ ఇప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడని, యంగ్‌స్టర్స్‌తో ఎలా ఉండాలో అతనికి తెలుసని, అండర్-19 ఫార్ములానే ఇక్కడా అమలు చేస్తున్నాడని ఇంజమామ్ వివరించాడు.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!