రాబోయే శ్రీలంక టూర్‌లో మెన్ ఇన్ బ్లూ టీమ్‌లో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ మరియు అభిషేక్ శర్మలను మినహాయించడంపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశ్నలు లేవనెత్తాడు.
భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి 19 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే, క్రీడా ప్రపంచంలో చాలా మంది భారత ఫుట్బాల్ లెజెండ్ ను గౌరవించడానికి, అభినదించడానికి ముందుకు వచ్చాయి. ఛెత్రి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో 10 నిమిషాల వీడియోతో పదవీ విరమణ ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి తనను మొదటిసారి పిలిచిన సమయంలో తన కెరీర్ సమయం ఇక ఫుట్బాల్ కు కేటాయించాలనే తన నిర్ణయాన్ని గుర్తు…
Yuzvendra Chahal Record in T20s: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చహల్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఔట్ చేసి.. టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయిని యూజీ అందుకున్నాడు. 301 మ్యాచ్‌లలో చాహల్ ఈ ఫీట్ సాధించాడు.…
Yuzvendra Chahal becomes first bowler to take 200 IPL wickets: రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 200 వికెట్స్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ నబీని ఔట్ చేయడంతో చహల్ ఖాతాలో రెండొందల వికెట్ చేరింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 153 మ్యాచ్‌లు ఆడిన మణికట్టు స్పిన్నర్ చహల్.. 7.73 ఎకానమీతో 200…
ఐపీఎల్ 2024లో భాగంగా.. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్ బౌలర్‌గా చాహల్ నిలిచాడు. 2015లో ఆర్సీబీ తరుఫున ఆడుతున్నప్పుడు ఎక్కువ పరుగులు ఇచ్చాడు. తాజాగా.. తన పాత రికార్డును…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చంఢీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్లో యజువేంద్ర చాహల్ సరికొత్త రికార్డును సృష్టించబోతున్నాడు. పంజాబ్ తో జరిగే మ్యాచ్లో చాహల్ 3 వికెట్లు పడగొడితే ఐపీఎల్ చరిత్రలోనే 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు.
వన్డే ప్రపంచ కప్ 2023 కోసం టీమిండియా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చివరలో అక్షర్ పటేల్ స్థానంలో ఆర్.అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అంతకుముందు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయం కావడంతో.. ఇంకా కోలుకోలేదు. దీంతో అశ్విన్ జట్టులో చేరాడు. అయితే అశ్విన్ టీమ్ లోకి రావడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జట్టు కోసం అశ్విన్ ఎంపిక చేయడంపై అసంతృప్తిని…
Harbhajan Singh surprised by exclusion of Yuzvendra Chahal in World Cup 2023 India Squad: త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్ కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముందునుంచి అందరూ ఊహించిన జట్టునే ఎంపిక చేసింది. ఆరుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లు, ఓ వికెట్ కీపర్,…
Sunil Gavaskar on Yuzvendra Chahal Snub In India Squad For Asia Cup 2023: అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. విండీస్ సిరీస్ సిరీస్‌లో విఫలమయిన సంజు శాంసన్ స్టాండ్ బైగా ఎంపికయ్యాడు.…
ఆసియా కప్ లో తనకు స్థానం దక్కుతుందని చహల్ అనుకున్నాడు. కానీ తన ఆశ నిరాశ కావడంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎవరిని ఒక్క మాట అనలేదు.. కేవలం రెండు ఎమోజీలతో కూడిన ఓ ట్వీట్ ను చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.