ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనున్నారు.. నేటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది… నేడు ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం… బొల్లవరంలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు.. బద్వేలు రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు మూడు రోజుల సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గన్నవరం…
విజయనగరం రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న సంగతి తెలిసిందే.. బోడికొండపై రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం.. తనను కొబ్బరికాయ కూడా కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి రాజు అసహనం వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై…
ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం. దీంతో టీడీపీ అధినేత దీక్షలు చేపట్టడం.. అనంతరం పట్టాభి అరెస్ట్, అసెంబ్లీ సమావేశాల ఘటన ఇలా ఒక్కో ఘటనకు ఏపీ రాజకీయాలు అతిథ్యమిచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల నారా భువనేశ్వరి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరుఫున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్… ఆ తర్వాత కర్నూలు వెళ్లనున్నారు.. ఇక, ఉదయం 11.15 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పంచలింగాల గ్రామానికి చేరుకోనున్నారు.. పంచలింగాలలో జరగనున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో…
ఏపీలో అధికారపార్టీని విమర్శించే స్వంత పార్టీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. దాడులు చేయడం జన్మ హక్కుగా వైసీపీ వ్యవహారిస్తోంది.సీఎం జగన్ స్పందించి, సుబ్బారావుపై దాడికి పాల్పడిన వ్యక్తుల చేత గుప్తా కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పించాలి. సుబ్బారావుపై దాడి చేసిన వారిని పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టించి, పోలీసుల చేత అరెస్టు చేయించాలి. దాడులతో భయోత్పాతం సృష్టిస్తే అడ్డుకట్ట వేయడానికి…
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ వేడకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు హజరయ్యారు. జగన్ జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సజ్జల ప్రారంభించారు. రక్తదానం, వస్త్రాల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు. అన్ని మతాల మత పెద్దలు ప్రార్ధనలు చేశారు.అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ కు…
ఇటీవల వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా చేసిన వైసీపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గత రెండు రోజులుగా ఏపీల హాట్‌టాపిక్‌గా నడిచిన ఈ విషయానికి నేడు జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తెరపడింది. విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కలిశారు. సీఎం జగన్ జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసి సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. మంత్రి బాలినేని తనపై దాడి చేయించినట్లు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్లకు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆమె.. తిరుపతిలో వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించారు.. 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా భువనేశ్వరిని.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. రాజకీయాలు నేను మాట్లాడను…
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య హైఓల్టేజ్ వార్ నడుస్తూనే ఉంది.. ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రూప్ వారు రోడ్డెక్కి రచ్చగా మారిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా మరోసారి అదే జరిగింది.. ఇప్పుడు పార్టీ సుప్రీం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో.. మరోసారి గ్రూప్ వార్ బయటపడింది.. ఎమ్మెల్యే ఆర్కే రోజా వర్సెస్ ఆమె వ్యతిరేక వర్గంగా మారింది పరిస్థితి… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన…