సంతనూతలపాడు వైసీపీలో లొల్లి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయనది ఆ జిల్లా కాదు. కానీ.. ఎన్నికల సమయంలో పార్టీ ఆదేశాలతో మరో జిల్లాకు వెళ్లి.. పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో ఆయనకు జైకొట్టిన పార్టీ కేడరే ఇప్పుడు రివర్స్. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ వచ్చిందని టాక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా లొల్లి?
రెండున్నరేళ్ల తర్వాత సంతనూతలపాడు వైసీపీలో లుకలుకలు
టీజేఆర్ సుధాకర్‌బాబు. ప్రకాశంజిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు అభ్యర్థిగా వైసీపీ నిర్ణయించటంతో ఇక్కడకు వచ్చి.. పోటీ చేసి వైసీపీ గాలిలో సునాయసంగా గెలిచారు. నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు ఆయన్ని పొరుగు వ్యక్తిగా చూడకుండా అక్కున చేర్చుకున్నారు కూడా. కొత్తలో ఎమ్మెల్యేకు.. కేడర్‌కు మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నా.. రెండున్నరేళ్ల తర్వాత లుకలుకలు బయటకు వస్తున్నాయి. అవి కొత్త రగడకు.. చర్చకు దారితీస్తున్నాయట.
Also Read
మండల నేతకు.. ఎమ్మెల్యేకు మధ్య అభిప్రాయభేదాలు..!
ఆ మధ్య సొంత పనులపై హైదరాబాద్ వెళ్లిన ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అవసరం లేదంటూ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారట. ఈ అంశం అధికారపార్టీతోపాటు పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. నాగులుప్పలపాడు మండలంలో ఆ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనస్తాపం చెంది ఎమ్మెల్యే ఆ నిర్ణయం తీసుకున్నారని లోకల్‌గా వినిపిస్తున్న టాక్. ఆ మండలంలోని ఒక కీలక నేతకు.. ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు మధ్య సమన్వయం కొరవడిందట. ఎంపీడీవో నియామకంపై బేధాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది.
వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపిన ఎమ్మెల్యే..?
నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఆ నాయకుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. చీమకుర్తి నుంచి మరో కీలకవర్గం కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అధిష్ఠానాన్ని కలిసి ఫిర్యాదు చేసిందట. ఈ పరిణామాలపై అసంతృప్తి చెందిన సుధాకర్‌బాబు తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారని చెబుతున్నారు.
వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి పంచాయతీ నుంచి జీతాలు?
నియోజకవర్గంలోని గ్రామ, మండలస్థాయి అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలతో సంబంధం లేకుండా తనకు ఇష్టం వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న వ్యక్తిగత సహాయ సిబ్బందిలో ఐదుగురిని చీమకుర్తి నగర పంచాయతీ ఉద్యోగులుగా చూపించి జీతాలు తీసుకోవటం కూడా విమర్శలకు దారి తీస్తోందట. పంచాయతీ విధులకు హాజరుకాకుండా వారెలా జీతాలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారట. వారికి జీతాల కోసమే ఏటా ఏడు లక్షలు ఖర్చవుతున్నట్టు సమాచారం.
సొంత వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్న ఎమ్మెల్యే?
గతంలో కూడా అధికారుల బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేస్తుంటారు ఆయన ప్రత్యర్థులు. పనిలోపనిగా ఎమ్మెల్యే కూడా సొంత వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారట. తనకు అనుకూలంగా ఉన్న నేతలకు పనులు చేసుకునేందుకు అవకాశాలు ఇస్తున్నట్టు వైరివర్గం మండిపడుతోంది. అలాగే వైసీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్న ద్వితీయ శ్రేణి నేతల కార్యకలాపాలపై సేకరించిన సమాచారాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యే పంపారట. దీంతో సంతనూతలపాడు వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీలోని ఆయన ప్రత్యర్థివర్గంగా పరిస్థితి మారిందట.
పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత మంత్రి బాలినేనికి అప్పగింత
పరిస్థితి చేజారిపోకుండా సమస్యలను పరిష్కరించే బాధ్యతను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్ఠానం అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. సంతనూతలపాడు వైసీపీలో అసమ్మతిని చల్లార్చేందుకు మంత్రి బాలినేని ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తారు? పార్టీ కేడర్ ఎమ్మెల్యే వెంట నడుస్తుందా.. ఢీ అంటే ఢీ అని ఘర్షణ పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!