టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రామకుప్పం మండలం అరిమాను పెంట గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమ్మ, చెల్లిలను రాజకీయంగా వాడుకొని వదిలేసాడని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పోలవరం 71 శాతం పూర్తి చేసామని, ఇవ్వాళే భారతి సిమెంట్ బస్తా పై 30 రూపాయలు పెంచారని ఆయన మండిపడ్డారు.
మూడేళ్ల పాలనలో జగన్ మూడు ఇళ్లు కూడా నిర్మించలేదని, సాక్షిలో మేనేజర్‌గా పని చేసే వ్యక్తి నన్ను బూతులు తిడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా దొరకడం లేదని, ప్రజల్లో తిరుగుబాటే జగన్ అనే వైరస్ కు మందు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అన్నింటా లూటీ చేస్తున్నారు. రేపు బ్యాంకులోని మీ సొమ్ము కూడా దోచేస్తారు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.