YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేకు సంబంధించిన క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సమగ్ర భూ సర్వే చేశారా?అంటూ ప్రశ్నించారు. భూముల రీ సర్వే కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించామని.. అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన…
ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం రాజీ పడబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు ఇప్పుడు ‘సూపర్ హిట్’ అయ్యాయని, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ (దీపం-2), అన్నదాత సుఖీభవ వంటి…
Karumuru Venkat Reddy: ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన ఓ వార్తా కథనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మీడియా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో హద్దులు కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా పేరిట వ్యక్తిగత అజెండాలతో, రాజకీయ బ్రోకరిజానికి పాల్పడుతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. Bhatti Vikramarka: ఆ మాత్రం కూడా…
YS Jagan: గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు.. మీరు పాలించడానికి అర్హులేనా?.. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? అని ప్రశ్నించారు.
MP Kesineni Chinni: జగన్ బొమ్మతో గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భోగి మంటల్లో వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చెందిన ఆస్తులపై గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ వేసుకున్నారు అని ఆరోపించారు.
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాస్ పార్టీ అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. అందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారని అంబటి రాంబాబు తెలిపారు. రానున్న 45 రోజుల్లో…
Sajjala Ramakrishna Reddy: జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం ఎలా దెబ్బ తీస్తుందనేది వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు.
Off The Record: ప్రతికూల పరిస్థితుల్లో కూడా… తన మెలో డ్రామాతో సానుభూతి సంపాదించుకోవడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట. వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన ఆయన.. గత ఎన్నికల సమయంలో టీడీపీలోకి జంప్ కొట్టి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని కోటంరెడ్డికి హామీ ఇచ్చారట. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే తనకు మంత్రి పదవి వస్తుందని, జీవితాశయం నెరవేరబోతోందని…
Perni Nani: కూటమి నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన… పార్టీ కార్యకలాపాల విషయంలో అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మచిలీపట్నంలో మా పార్టీ సమావేశం పెట్టుకుంటే.. కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదం. అధికారులు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా, పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా పని చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పులు వచ్చినా కూడా…