ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: రఘురామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ గుర్తుతో గెలిచినా.. నిత్యం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై లోక్‌సభ ఎంపీ ఓంబిర్లాను కూడా వైసీపీ ఎంపీలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని… అయినా వారి ప్రయత్నాలు సాధ్యం కాలేదన్నారు. తన కోసం వైసీపీ నేతలు పడుతున్న పాట్లను చూస్తుంటే తనకే జాలి వేస్తుందని ఎద్దేవా చేశారు.
Read Also: పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
అయితే ఎంపీ పదవికి తానే రాజీనామా చేస్తానని రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తనపై అనర్హత వేటు వేయకపోయినా తానే రాజీనామా చేస్తానని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని… వైసీపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఉపఎన్నిక ద్వారా తెలియజేస్తానని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఏపీలో అన్ని రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పేంటని ఆయన నిలదీశారు. వారిని ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులు పెడుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!