చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం నుంచే పోటీ చేస్తానని, మళ్లీ సీఎం అవుతానని ఆయన అన్నారు. అంతేకాకుండా స్థానిక నేతలు మారకపోతే వాళ్లనే మార్చేద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని ఆయన అన్నారు. మద్యం తయారీలో రసాయనాలు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే మరో వైపు దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రావడం, నేను సీఎం అవ్వడం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో పెట్టుబడులు తిరిగి వెళ్లిపోయాయన్నారు. వైపీసీ ప్రభుత్వం రైతుల అవస్థలు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.