ఏపీలో సినిమా టిక్కెట్ల ధర విషయంపై అగ్గి రాజుకుంది. హీరో నాని చేసిన కామెంట్లపై ఒకవైపు ప్రభుత్వం విమర్శిస్తుంటే.. మరోవైపు పలువురు ప్రతిపక్షాల నేతలు నానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ‘ఏంటో మరి’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. Read Also: హీరో నానికి మంత్రి అనిల్ కౌంటర్.. పవన్ మోజులో పడి చాలా తగలేశా..! ‘నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు…
క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని పేర్కొన్నారు సీఎం జగన్.. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా…
రాష్ట్ర డీజీపీకి ఇప్పటికే పలు సందర్భాల్లో లేఖలు రాస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ మరోసారి డీజీపీకి లేఖ రాసిన ఆయన.. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ కార్యకర్త మురళీని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారు.. హత్యాయత్నానికి పాల్పడ్డారని.. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని.. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని పేర్కొన్నారు.. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. ఇప్పటికే హీరో నాని వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు స్పందించగా.. తాజాగా మంత్రి కన్నబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్, తిను బండారాలపై దోపిడీ జరుగుతోందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ హీరో నాని తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.. ఏపీ మంత్రులు.. హీరో నానిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటే.. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాత్రం ఆయనకు బాసటగా నిలిచారు.. టిక్కెట్ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత… హీరో నానికి థాంక్స్ చెబుతున్నాను.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని వ్యాఖ్యానించారు.. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్న అనిత.. ఈ…
ఏపీ సీఎం జగన్ ఈ రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో రూ. 515 కోట్లతో మొత్తం 8 అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చనిపోయాక కడప జిల్లా జనం నన్ను గుండెల్లో పెట్టుకున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో 30 నెలల్లో ప్రజలకు 320 కోట్లు బదిలీ చేసామని, 22,212 మంది అక్క చెల్లెమ్మలకు…
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన రెండు బస్సు సర్వీసులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన బస్సు సర్వీసులో టికెట్ కొనుగోలు చేసి మంత్రి మంత్రి పెద్దిరెడ్డి బస్సులో ప్రయాణించారు. పుంగనూరు పరిధిలోని ఎస్.అగ్రహారం, ఏ.కొత్తకోట మధ్య విద్యార్థులకు అనువైన సమయంలో బడిబస్సు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ప్రజల అవసరాల మేరకు పుంగనూరు నుండి మండల కేంద్రాల మీదుగా చిత్తూర్, అక్కడి నుండి చెన్నై కు…
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులివ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఒక ఇంటిలోని పోర్షన్ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఫలితంగా మీటర్…
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. రామతీర్థంలో శంకుస్థాపన కార్యక్రమానికి, తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు ఈవో ప్రసాద్.. దీంతో.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. కాగా, విజయనగరం రామతీర్థం బోడికొండపై బుధవారం…