ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు వీలుగా వైసీపీ సర్కార్.. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై అనేక విమర్శలు కూడా లేకపోలేదు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు అన్నీ ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి…
వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నిప్పులు చేరిగారు. హిందువులన్నా, హిందూ ఆలయాలన్నా జగన్ ప్రభుత్వానికి చులకనగా కనిపిస్తున్నట్లుందని, హిందువుల సహనాన్ని పరీక్షించాలని చూస్తున్నట్లుందని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి హిందువులు తలచుకుంటే తమ ఓటు ద్వారా మీ ప్రభుత్వానికి భవిష్యత్తు లేకుండా చేస్తారని హెచ్చరించారు. మొన్న త్రిపురాంతకంలో అయ్యప్పస్వామి విగ్రహాన్ని తొలగించారు, నేడు గిద్దలూరులో ఏకంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో…
అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శిక్షణ తరగుతలలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని అన్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు. రాయలసీమలోనే హైకోర్టు ను పెట్టండి అని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చెప్పామని, హైకోర్టు విషయం ఇప్పుడే తేలేలా లేదని ఆయన అన్నారు. ఏపీ…
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలుమార్లు సమావేశమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఫిట్‌మెంట్‌పై ఓ నిర్ణయానికి రావాలని సూచించారు. ఉద్యోగులకు న్యాయపరంగా డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సీఎం జగన్‌తో కూడా పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లపై కూడా…
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. తిరుపతిలో ఈరోజు అమరావతి రైతు మహాసభ జరిగింది. ఈ సభకు ప్రతిపక్షాలు హాజరయ్యాయి. కాగా, అమరావతి సభపై వైపీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ కోసం జరిగిన కాదని, క్యాపిటలిస్టు కోసం జరిగిన పాదయాత్ర అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమపై దండయాత్ర చేసినట్లు పాదయాత్ర చేశారని, విశాఖ…
ఏపీలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీలకే ఉంటుంది. వార్డు మెంబర్ ఎన్నిక నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య అసలైన పోరు ఉంటుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పౌరులకు తెలియంది కాదు. అయితే రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్ర ప్రదేశ్‌గా ఎన్నో హంగులతో…
టీడీపీపై మరోసారి మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. 2016-17లో ఓఆర్ఆర్ కట్టాలంటే 8వేల ఎకరాలు అవసరం అని నివేదిక ఇచ్చారని, దీనికి 17 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసి అప్పట్లో చంద్రబాబు కేంద్ర సహాయం అడిగారని ఆయన అన్నారు. భూ సేకరణ చేసి ఇస్తే చూస్తామని కేంద్రం చెప్పిందని, కేంద్రం అడిగినా 2018 వరకు కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. అప్పడు వారు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా…
సీఆర్డీఏ రద్దు, 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిర్వఘ్నంగా పూర్తయ్యింది. న్యాయంస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టి రాజధాని రైతులు పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగింది. ఈ నేపథ్యంల మహాపాదయాత్ర ముగింపుగా ఈ రోజు తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ ఏర్పాటు చేశారు అమరావతి రైతులు. అయితే ఈ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఆయన తిరుపతి విమానాశ్రయంకు చేరుకొని అక్కడి నుంచి సభ ప్రాంగణానికి…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రూ.247 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ఆయన.. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్‌తో పాటు.. విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.. మొత్తంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు విశాఖలో ఆయన పర్యటన కొనసాగనుంది.. Read Also: డిసెంబర్ 17, శుక్రవారం రాశిఫలాలు… ఇక, సీఎం వైఎస్…