ఏపీ ప్రభుత్వం నిన్న ఇళ్ల పట్టాలతో సహా 16 సంక్షేమ పథకాల అర్హులై లబ్దిపొందని వారికి వారి ఖాతాలలో నగుదను జమ చేసింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. అయితే నిన్న ప్రభుత్వం జమ చేసిన నగదు, ఇతర సంక్షేమ పథకాలు అందని అర్హులెవరైనా ఉంటే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ వెల్లడించారు. అయితే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన పుష్ప సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు పుష్ప సినిమా పోస్టర్ చూసాను, ఆ సినిమాను నేను చూస్తాను.. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి పుష్ప సినిమాలో చూపించారు. ఆ సినిమాలో విధంగా ఏపీలోనూ జరుగుతోందని ఆయన అన్నారు.…
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ, నేతలు చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… టీడీపీ ఎజెండా ప్రకారమే బీజేపీ సభ నిర్వహించిందన్న ఆయన.. టీడీపీ, బీజేపీ, జనసేన… ఒకరు రాగం అందుకుంటే… మరొకరు పల్లవి అందుకుంటారు అంటూ సెటైర్లు వేశారు. ఎవరైనా ప్రజల సమస్యలపై మాట్లాడితే మేం సమాధానం ఇస్తాం.. కానీ, అలా కాకుండా వాళ్లే దేవాలయాలు కూలగొట్టేయటం, వాళ్లే ఆరోపణలు చేయటం రాజకీయమే అన్నారు. రాష్ట్రంలో…
వంగవీటి రాధా ఎపిసోడ్ ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని పేర్కొన్నారు.. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. చివరకు ప్రభుత్వం వెంటనే రాధాకు 2+2 గన్మన్ల భద్రత కూడా కల్పించింది. రాధా భద్రతపై సీఎం వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు కీలక…
పీఆర్సీ ప్రకటనపై ఓవైపు ఉద్యోగులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ కసరత్తు కొనసాగుతూనే ఉంది.. ఇవాళ పీఆర్సీ పై మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది.. సీఎం జగన్ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారుల సమావేశం నిర్వహించారు.. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు.. ఇక, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఆర్ధిక శాఖకు సంబంధించిన సమావేశంలో పీఆర్సీపై చర్చ జరిగిందని…
వంగవీటి రంగా వర్థంతి సభలో తాజాగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని రాధా సంచలనానికి తెరలేపారు.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని రాధా స్పష్టం చేవారు. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే, ఇవాళ వంగవీటి రాధాకు సెక్యూరిటీ పెంచింది ఏపీ ప్రభుత్వం.. వంగవీటి రాధాకు 2+2 భద్రత కల్పించాలని…
పేదలకు మేలు చేసే ఓటీఎస్ పథకాన్ని విమర్శిస్తున్న వారిపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. ఓటీఎస్ పై ప్రతిపక్షం, వారికి అనుకూలంగా ఉన్న మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఒక సంస్కరణ లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఓటీఎస్ ను తెచ్చారు. ఓటీఎస్ చేసుకోవడం ద్వారా పట్టా ఇచ్చి శాశ్వత హక్కు కల్పిస్తున్నాం. పట్టా ద్వారా తాకట్టు పెట్టుకునేందుకు, రుణం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒక రూపాయి కూడా లేకుండా ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ప్రభుత్వం ఓటీఎస్…
కృష్ణా జిల్లా గుడివాడలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ నేత వంగవీటి రాధాలు ఒకేచోట కలుసుకున్నారు. గుడివాడలోని కొండాలమ్మ గుడి వీరి కలయికకు కారణమైంది. ఈ ముగ్గురూ కృష్ణా జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్ కావడం విశేషం. అంతకుముందు గుడివాడలో వంగవీటి రంగా విగ్రహ ప్రారంభోత్సవానికి వంగవీటి రాధా వెళ్లారు. అనంతరం వల్లభనేని వంశీ, వంగవీటి రాధా కొండాలమ్మ గుడికి వెళ్లగా… రాధాతో పాటు…
విజయనరగంలోని రామతీర్ధం ఘటనలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు వైసీపీ, టీడీపీలు బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటి వరకు ఆ ఘటనలకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి కేంద్రం సహకరిస్తోందని, హిందు ధార్మిక అలయాలన అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధుల కేటాయించాలని అన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల అంశాన్ని వైసీపీ అనవసరంగా వివాదం చేస్తున్నదని అన్నారు. Read:…
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా యాక్టర్, పొలిటీషియన్‌గానే కాదు.. డాక్టర్‌గానూ తన సేవలందిస్తున్నారు. పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే మెడలో…