నల్లజర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ద్వారకాతిరుమలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. కేశినేని నాని,షేక్ ఆసిఫ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రతి గడపకు వెళ్తుంటే మంచి రెస్పాన్స్ వస్తోందని ఆమె వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ మండలంలోని రాఘవపురం, పల్లగిరి, కమ్మవారిపాలెం గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు భారీ ఎత్తున ప్రజలు వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం ఉండదని.. ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడని ఆయన ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల్లో హోరెత్తుతోంది. ఇక మిగిలింది 4 రోజులే ఉండడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్ క్యాంపెయినర్లు అంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు.
తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ పరిస్థితి ఉంది కాబట్టే.. సైకిల్ బెల్ మోగిస్తు ప్రజలను భ్రమ పెడుతున్నారనీ విమర్శించారు
తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు.