Vallabhaneni Vamsi vs Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడుకు బహిరంగ సవాల్ విసిరారు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్.. కాణిపాకం వినాయకుడు గుడిలో చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా? అని ప్రశ్నించిన ఆయన.. నేను నా పిల్లలతో వచ్చి ప్రమాణం చేస్తాను.. మీరు వస్తారా? అంటూ సవాల్ చేవారు.. నన్ను చంద్రబాబు చిన్న సైకో అంటున్నారు.. మరి మూడు సార్లు బీ ఫారం ఇచ్చిన చంద్రబాబు బొల్లి సైకో, ముసలి సైకో అవుతాడా? అంటూ సెటైర్లు వేశారు. అనవసర, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలంటూ హితవుపలికారు.. నేను అవినీతిపరుడిని అని చంద్రబాబు అంటున్నాడు.. కాణిపాకం వినాయకుడు గుడిలో చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.. ఇక, అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నారు.. అసలు ఆ సమయంలో నేను అసెంబ్లీలో లేను, పంజాబ్ లో ఉన్నాను అని స్పష్టం చేశారు. చంద్రబాబు గుడ్డ కాల్చి మీద వేస్తే మేం నిరూపణ చేసుకోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్.
Read Also: KTR: ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ.. కాంగ్రెస్ నాయకులు లూటీ స్టార్ట్ అయింది..