తొలి వీడియోలో తన తండ్రి ఛాలెంజ్‌ను తప్పుబట్టిన ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టంగా పేర్కొన్న ఆమె.. పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యల పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు.. అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో…
కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
అనకాపల్లి జిల్లాలోని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామమైన తారువలో ఉద్రిక్తత ఏర్పడింది. బూడి ముత్యాల నాయుడు, ఆయన కుమారుడు బూడి రవిల మధ్య గొడవ రాజకీయ రచ్చకు దారితీసింది.