Allu Arjun At Nandyal: నంద్యాలలో అల్లు అర్జున్ సందడి.. ఇదేం క్రేజ్ మామ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun At Nandyal: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశారు.. నంద్యాల చేరుకున్న అల్లు అర్జున్ ను చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఫ్యాన్స్.. ఎటు చూసినా జనమే అన్న చందంగా మారిపోయింది నంద్యాల.. ఇక, గజమాల తో పుష్పకు ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు.. ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్వా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ రెడ్డికి పూలమాలలతో స్వాగతం పలికారు శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు.. అల్లు అర్జున్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో.. శిల్పా రవి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.. అసలు, ఫ్యాన్స్‌ను ఛేదించుకుంటూ.. తన మిత్రుడి ఇంట్లో అడుగు పెట్టేందుకు బన్నీ చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఇక, శిల్పా రవి ఇంటి బాల్కనీ నుంచి తన ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు ఐకాన్ స్టార్.
Read Also: Bandi Sanjay: మోడీ లేకపోతే.. భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం..
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
కాగా, గత ఎన్నికల్లో తొలిసారి నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి బరిలోకి దిగారు.. ఆ సమయంలో కూడా బన్ని తన మిత్రుడికి మద్దతుగా నిలిచారు.. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు శిల్పా రవి.. ఎన్నికల సమయం కావడంతో.. మళ్లీ ఇప్పుడు కూడా శిల్పా రవి.. నంద్యాలలో తన భార్యతో కలిసి సందడి చేశారు.. తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు. మొత్తంగా రాజకీయాలు వేరు.. తమ స్నేహం వేరంటూ.. ప్రచారానికి తెరపడనున్న రోజు.. నంద్యాలలో సందడి చేశారు అల్లు అర్జున్. ఓవైపు బన్నీ ఫ్యాన్స్, మరోవైపు వైసీపీ శ్రేణులతో నంద్యాల కిక్కిరిసిపోయింది. మరోవైపు.. #AlluArjunAtNandyal అపూ యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ మారింది.. తమ అభిమాన నటుడి నంద్యాలలో అడుగుపెట్టిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!