ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా, నాల్గో విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.. ఇక, ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు.. వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్‌లు ప్రచారంలో పాల్గొననున్నారు..
వైయస్సార్ పేరు లేకుండా చేస్తున్న ఇలాంటి వారా? వైఎస్సార్ వారసులు? అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.. కడపలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణానంతరం ఆయన పేరును చార్జిషీట్లో పెట్టిన పార్టీ.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ.. చార్జిషీట్ లో మనమే ఆ పేరు పెట్టించామట.. ఎంతటి దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారో చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామన్నారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు.
మరో 3 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని సీఎం అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు అని.. పొరపాటు చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు సమయం వృథా చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. మద్ధతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధంమవుతోంది. రేపటితో కీలకమైన ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. తమ ప్రభుత్వంలో చేసి అభివృద్ధి, సంక్షేమం, మంచి పనులు వివరిస్తూ ముందుకెళ్తున్నారు.
పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు.