ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పూల మార్కెట్ వ్యాపారులను కేశినేని శ్వేతా కలిసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పూల మార్కెట్ లోని వ్యాపారస్తులందరూ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని విజయవాడ ఎంపీగా గెలిపించుకుంటామని చెప్తున్నారని ఆమె అన్నారు. కేశినేని నాని బంఫర్ మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు. విజయవాడ ప్రజలు కేశినేని నానిని సొంత బిడ్డగా భావిస్తారని.. గత 10 సంవత్సరాలుగా విజయవాడను 8 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన వ్యక్తి కేశినేని నాని అని పేర్కొనింది. గత 60 సంవత్సరాలు వెనుక బడి ఉన్న విజయవాడకు ఫ్లైఓవర్, రహదారులు, ఎయిర్ పోర్ట్ ద్వారా అనేక అభివృద్ధి పనులు చేశారని కేశినేని శ్వేతా వెల్లడించింది.
Read Also: Chhattisgarh : విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకున్న పేరెంట్స్.. కూతురిపై కోర్టు కీలకవ్యాఖ్యలు
కాగా, కేశినేని భవన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి కేశినేని నాని అని శ్వేతా తెలిపింది. కేశినేని నాని చూడడానికి రాయిలా కనిపిస్తారు.. కానీ, ఆయన మనస్సు మాత్రం చాలా స్మూత్ అన్నారు. ఎవరైనా ఆయనకు ప్రేమ పంచితే తిరిగి కొండంత ప్రేమను తిరిగి ఇస్తారని తన తండ్రి గురించి చెప్పారు కేశినేని శ్వేతా. కేశినేని నానిని సొంత కుటుంబంగా భావించే విజయవాడ ప్రజలు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యే గా అసిఫ్ ను గెలిపించాలని కేశినేని శ్వేతా కోరారు.