Sajjala Ramakrishna Reddy: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం.. ఆ బిల్లుకు టీడీపీ మద్దతిచ్చింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆ బిల్లు వచ్చినప్పుడు టీడీపీ మద్దతు ఇచ్చిందన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాయి అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక, DBT పద్ధతిలో అవినీతికి ఆస్కారం లేకుండా నగదును లబ్దిదారులకు అందేలా చూశామని వెల్లడించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశారు సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసలు కురిపించారు.. గెలుపు పై పూర్తి ధీమాతో ఉన్నాం.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తాం.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Amritpal Singh: అమృతపాల్ సింగ్ ఆస్తుల విలువ రూ.వెయ్యి.. అఫిడవిట్ లో వెల్లడి
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ఇక, ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడిన విషయం విదితమే.. ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది. 2019 జులై 29వ తేదీన టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మద్దతిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలోనే టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చింది? అని నిలదీసిన విషయం తెలిసిందే.. యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా.. చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?. ఇదంతా వైసీపీకి ప్రజలు ఓటు వేయవద్దని చంద్రబాబు కుట్ర. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!