వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ నేక పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ మార్పు కోసం వచ్చాడని అందరం భావించాం.. కానీ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి వచ్చాడని ఈ మధ్యే అర్థం అయిందని ఆయన చెప్పారు.
మోసలతో యుద్ధం చేస్తున్నాం.. వాలంటీర్లు ఇంటికే రావాలన్న, పెద్దవాళ్ల బతుకు మరాలన్నా, వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా.. ఫ్యాన్ గుర్తు ఉన్న రెండు బటన్లు నొక్కాలి.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి..
ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి బహిరంగసభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు.. ఏపీ వికాస్ మోడీ లక్ష్యంగా పేర్కొన్నారు..