ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా ప్రవేశించాయి. అయితే ఆలస్యంగా తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు విస్తరించడంలో కూడా మందగిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో పాటు హైదరాబాద్‌లోని నార్త్, వెస్ట్ ఏరియాల్లో నేటి రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షం దంచికొడుతోంది.…
నైరుతి రుతుపవనాలు కేరళను మూడు రోజుల ముందుగానే తాకాయి. అయితే రుతుపవనాల విస్తరణ మాత్రం నెమ్మదిగా జరుగుతోంది. అయితే తాజాగా వాతావరణ శాఖ తెలంగాణకు రానున్న మూడు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం వెల్లడించారు. జూన్ 6 నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న ఆయన.. హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం…
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రుతుపవనాలు వేగంగా విసర్తిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. మరో వారం…. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి.…
ఎండలతో సతమతం అవుతున్న ప్రజానీకానికి ఐఎండీ చల్లని కబురు అందించింది. భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం చేశాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు వివరించింది. అంతేకాకుండా బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడుకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు…
భానుడి భగభగకు హైదరాబాద్ వాసులు ఉక్కపోతతో సతమతమవుతున్న వేళ… వరుణుడు కరుణించాడు.. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో.. నగరంలోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులు జలమయమవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం…