ఏపీలో వాతావరణం ఎలా వుండబోతోంది? అమరావతిలోని వాతావరణ విభాగం పలు సూచనలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పడమర గాలులు వీస్తున్నాయి. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు ఎలా వున్నాయంటే. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు, రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
IAS Officers: ఐఏఎస్ ఆఫీసర్లు కావలెను.. దాదాపు 1500 మంది..
ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. రేపు మరియు ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమలో ఈ రోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఈరోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు మరియు ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. రేపు మరియు ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము తెలిపింది.