1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,500లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.62,500 లుగా ఉంది.
2. నేడు విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ. జింఖానా గ్రౌండ్స్‌లో దేశ రక్షణ పేరుతో బహిరంగ సభ. బహిరంగ సభలో ప్రసంగించనున్న సీతారాం ఏచూరి.
3. నేడు ఫిలిం ఛాంబర్ ముందు నిర్మాతల ఆందోళన. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కమిటీ తీరుకు నిరసనగా ఆందోళన.
4. నేడు టీటీడీ బోర్డు సమావేశం. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్టు సమావేశం. శ్రీవారి బ్రహోత్సవాల ఏర్పాట్లపై ప్రధాన చర్చ.
5. నేడు బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ భేటీ. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం కానున్న కమిటీ. మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్న సభ్యులు.
6. నేడు గుడివాడలో పాదయాత్ర చేయనున్న అమరావతి రైతులు.
7. నేటి నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు. బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత గెహ్లాట్. ఎంతమందైనా నామినేషన్లు వేసేలా వెసులుబాటు.
8. నేడు ఇంగ్లాండ్‌తో భారత మహిళల జట్టు మూడో వన్డే. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్. కేరీర్‌లో చివరి మ్యాచ్ ఆడనున్న పేసర్ గోస్వామి.
9. నేడు, రేపు ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు. వచ్చే రెండు రోజులు తెలంగాణలో మోస్తరు వానలు.