ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై ఆగ్నేయ దిశ నుంచి అల్పపీడనంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు తగ్గాయి. 16 నుంచి వాతావరణంలో మార్పులు రావడం.. పగలు, రాత్రి అనక వర్షాలు, వడగండ్ల వానలు పడటంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణ ఉక్కపోత నుండి కాస్త ఉపసమనం లభించింది. అయితే రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి.